Past-Tree;Future-Tree-Present TreePast Tree నుంచి Present Seed వచ్చిందిPresent Seed నుంచి Future Tree వస్తుంది.అందుకనే Seed is Very Importrnt.
కాలు జారితే వెనక్కు తీసుకోగలం
కాని మాటజారితే వెనక్కుతీసుకోలేము.
ధృడమైన విశ్వాసం లేకపోతేభగవంతుడు ఏ సహాయం చేయలేడు.
ఎవరైనా నిన్ను నిందించినా,అవమానపరచినా,ప్రేమతో చిరునవ్వుల పూలు
వెదజల్లుతూ వారిపై శుభబావములు కురిపించుము.
నిత్య సంతోషులు ఎన్నడూ సోమరి పోతులు కారు,
సోమరితనం పెద్ద దుర్గుణం.
ఉదార హృదయులు అసంభవాలను కూడ సంభవం చేయగలరు.
నేను ఈ క్షణం సంతోషంగా గడిపితే
తర్వాత క్షణం కూడా నాకు ఆనందం ప్రదమయ్యే అవకాశాలెక్కువ.
నీ మనస్సాక్షియే నీకు మంచి స్నేహితుడు
కావున తరచుగా తనమాట వినటం మంఛిది.
చెవులు రెండు,నోరు ఒకటి.
ముందు విను తరువాత మాట్లాడు.
ఈ రోజు నువ్వు చెప్పే అబద్దం
రేపు మళ్ళీ అబద్దం చెప్పేందుకే ప్రేరేపిస్తుంది.
ఎల్లపుడూ వినయమనే వస్త్రాలనే దరించిఉంటే నీవు అందరి ప్రేమనూ,సహకారాన్ని పొందుతావు.
నీవు సమయాన్ని వ్యర్దం కాకుండా రక్షిస్తే,
సమయం నిన్ను రక్షిస్తుంది.
నీవు నిష్కపటంగా వుంటే నీ ఆలోచనలు,మాటలూ
మరియు కర్మలు ధృడనిశ్ఛయాన్ని కల్గివుంటాయి.